Sunday, May 5, 2024
- Advertisement -

ప్రజలు రేషన్ బియ్యం అమ్ముకునే పరిస్థితి ఇకనుంచి ఉండదు…సీఎం జగన్

- Advertisement -

నాణ్యమైన బియ్యం’ పేరుతో పేదల ఇంటికి బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇవాళ ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత శ్రీకాకుళం జిల్లాలో వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు. కార్యక్రమం సందర్భంగా జగన్ పలు వ్యాఖ్యలు చేశారు.

చౌక ధరల దుకాణాల్లో ప్రజలు తీసుకుంటున్న బీయాన్ని, రూపాయి, రెండు రూపాయలకు తిరిగి విక్రయిస్తున్న పరిస్థితిని పోగొడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని వారి నుంచే కొనుగోలు చేస్తున్న డీలర్లు, తిరిగి దాన్నే ప్రభుత్వానికి అమ్ముతున్నారని, ప్రభుత్వం మళ్లీ ఆ బియ్యాన్నే ప్రజలకు అందిస్తోందని, ఇకపై ఇలా జరగదని చెప్పారు.

ప్రజలకు ‘స్వర్ణ’ రకం వంటి క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించడం ప్రారంభిస్తానని, ఆరు నెలల పరిశీలన అనంతరం ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -