Saturday, May 4, 2024
- Advertisement -

తండ్రిబాట‌లో జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు. త‌న తండ్రి దివంగ‌త నేత వైఎస్ఆర్ బాట‌లోనె జ‌గ‌న్ న‌డుస్తున్నారు. తొలి కేబినెట్ భేటీలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టిన జ‌గ‌న్ రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో త‌న దైన శైలిలో ముందుకు వెల్తున్నారు.

ఆర్టీసీ విలీనం, సీపీఎస్ రద్దు వంటి నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంన్న తాజాగా వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నారు. తన తండ్రి బాటలో ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… వైఎస్ హయంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాఆంధ్ర.. మూడు ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు ఉండగా.. ఇప్పుడు సీఎం జగన్‌ కూడా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను తిరిగి ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణా-గుంటూరు, ప్రకాశం, నెల్లూరు-సీమ ప్రాంతాలుగా మండళ్లుగా చేయాలనుకుంటున్నారట. ఈ ఐదు బోర్డులకు ఐదుగురు ఛైర్మన్లను నియమించి.. వారికి కేబినెట్ హోదా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా పార‌ద‌ర్శ‌క పాల‌న చేయ‌డానికి అనుగునంగా ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలను మండళ్లుగా ఏర్పాటు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు జగన్ మళ్లీ మండళ్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న వెలువ‌రించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -