Saturday, May 4, 2024
- Advertisement -

విద్యా సంస్ధలపై ఆర్ బి ఐ గవర్నర్ హెచ్చరిక

- Advertisement -

విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్న విద్యా సంస్ధల పట్ల విద్యార్ధులు జాగ్రత్తగా ఉండాలని, విలువలు పాటించని ఆ సంస్ధలు విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నాయని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. విద్యార్ధుల తల్లితండ్రులను అప్పుల్లో ముంచేసి, నిరుపయోగమైన డిగ్రీలు ఇచ్చే విద్యార్ధులు బలి కావద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

ముందు ముందు చదువు కోవడం కంటే కొనడమే ఎక్కువవుతుందని, ముఖ్యంగా పరిశోధనాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువు మరింత ఖరీదవుతుందని ఆర్ బి ఐ గవర్నర్ అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం విరివిగా విద్యా రుణాలు ఇవ్వడమేనని ఆయన సూచించారు.

అదే సమయంలో రుణాల వసూలు పట్ల కూడా శ్రద్ధ వహించాలన్నారు. రుణం తీసుకున్న వారిలో కాలం కలిసిరాని వాళ్లను, తక్కువ ఆదాయంతో ఉద్యోగాల్లో ఉన్న వాళ్లను క్షమించవచ్చునని చెప్పారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -