పిల్లలే కాదు.. టీచర్స్ కూడా .. నయా రూల్ !

ఇటీవల ఏపీ విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్.. ఆదిశగా ముందడుగులు వేస్తోంది. ఇక ఇప్పటికే స్కూల్స్ విలీనంపై జగన్ సర్కార్ పై అన్నివైపులా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ( ఆగష్టు 16 ) నుంచి ప్రవేశ పెట్టిన టీచర్స్ ఫేస్ రికగ్నెషన్ విధానంపై ఉపాధ్యాయుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ప్రవేశ పెట్టిన విధానంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం తొమ్మిది గంటల లోపు ఉపాధ్యాయులు సెల్ఫి దిగి మొబైల్ యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెల్ఫి దిగి యాప్ లో అప్డేట్ చేసినప్పుడే టీచర్ యొక్క హాజరు నమోదవుతుంది.

ఒకవేళ 9 గంటల సమయం దాటితే హాజరు కు సంభంధించిన ఆప్షన్ మొబైల్ యాప్ లో కనిపించాదు. దాంతో ఉపాద్యాయులు తప్పనిసరిగా ఉదయం 9గంటల లోపు స్కూల్ లో అటెండ్ అయ్యి ఫేస్ రికగ్నెషన్ ద్వారా తన హాజర్ ను దృవీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ఒక విధంగా మంచిదే అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది ఉపాద్యాయులు.. సక్రమంగా స్కూల్స్ కు అటెంట్ అవ్వకుండా వారి తరుపున సబ్ టీచర్స్ ను స్కూల్స్ లో ఉంచుతూ పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్పడంలో విఫలం అవుతున్నారు. దాంతో కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ అంటెండెన్స్ విధానంతో ఉపాద్యాయులు కచ్చితంగా స్కూల్స్ కు హాజరు కావల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ విధానంలో కొన్ని సాంకేతిక లోపాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే టీచర్స్ అందరూ ఒకే సమయంలో యాప్ ఉపయోగించడం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా కొన్ని చోట్ల ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉన్న ప్రాంతాలు కూడా చాలానే ఉన్నాయి. దాంతో ఈ అటెండెన్స్ విధానం ద్వారా ఉపాద్యాయులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. దాంతో ఈ విధానాన్ని చాలా మంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఆన్లైన్ అటెండెన్స్ విధానం ద్వారా టీచర్స్ పై సర్కార్ గట్టిగానే స్ట్రోక్ ఇచ్చిందనే చెప్పాలి.

Also Read : మొబైల్ లాక్ మర్చిపోతే ఇలా చేయండి..!

Related Articles

Most Populer

Recent Posts