Thursday, March 28, 2024
- Advertisement -

స్కూళ్ల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం జారీ చేసిన మెమోను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా ప్రభుత్వ ఆదేశాల అమలును నిలిపివేయాలన్న పిటిషనర్ల తరుపు వాదనను కోర్టు తోసిపుచ్చింది.

పాఠశాలల్లో సరైన కరోనా జగ్రత్తలు తీసుకోవడం లేదని, శానిటైజేషన్ వంటివి చేయకుండానే పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్న పిటిషనర్ల తరుపు వాదనను కోర్టు తోసి పుచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో నూ విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నారని న్యాయస్థానం గుర్తు చేసింది.

అయితే పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్ లైన్ తరగతులు నిర్వహణకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కోసం ఫిబ్రవరి నెల చివరి వరకూ ఆన్ లైన్ తరగతులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. కాగా టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -