Wednesday, May 22, 2024
- Advertisement -

లం .. కొడకా … అంటూ ముద్రగడ బూతులు .. ఎవరిని .. ఏమైంది ?

- Advertisement -

పదమూడు రోజులుగా నిరాహార దీక్ష చేసి ఇవాళే దీక్ష విరమించారు ముద్రగడ పద్మనాభం. కాపు యువకులని తుని ఘటన లో అరస్ట్ చెయ్యడాన్ని మేము ఒప్పుకోం అంటూ మొదలయిన ఆయన దీక్ష చిరంజీవి – దాసరి , బోత్స లాంటి వారు కలిసి రావడం తో తారా స్థాయి కి చేరుకుంది. నిమ్మరసం తాగి మరీ దీక్ష ని విరమించిన ముద్రగడ మీడియా తో ఘాటుగా మాట్లాడారు.

మీడియా ని ఏమీ అనకపోయినా ఆయన వాడిన పరుష పదజాలం భూతులు అన్నీ మీడియా కీ జనాలకీ షాకింగ్ గా అనిపించాయి. “నా కుమారుడిని కొట్టుకుంటూ తీసుకెళతారా… లం.. కొడకా?” అంటూ ముద్రగడ తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తన ఇంట్లో తలుపులు బద్దలు కొట్టారని – దాన్నితప్పని చెప్పడం లేదని దీక్ష నాలుగో రోజో – ఐదో రోజో మనిషికి సీరియస్ అయిన సమయంలో చేయాల్సిన పనిని దీక్ష ప్రారంభించిన మూడు గంటల్లో చేయడం ఏంటని ప్రశ్నించారు.

తనను మాత్రం గౌరవంగానే తీసుకు వెళ్లారని – తన భార్యను దారుణాతి దారుణమైన తిట్లు తిట్టారని ఆరోపించారు. కోడల్ని – బావమరిది భార్యలను ‘లం… రావే’ అంటూ లాక్కెళ్లారని ఆరోపించారు. పోలీసులు తమను ఖైదీల కంటే హీనంగా చూశారని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -