Tuesday, May 14, 2024
- Advertisement -

ఒకేసారి లోక్ సభ, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులకు చేదువార్త

- Advertisement -

ఎన్నిక‌ల్లో అభ్య‌ర్తులు రెండు చోట్లు పోటీ చేయ‌డం ఇప్ప‌టి వ‌ర‌కూ చూశాం. ఒక చోట ఓడిపోయినా మ‌రో చోట గెలిచి చ‌ట్ట స‌భ‌ల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే ఇప్ప‌టినుంచి ఒకేసారి లోక్ సభ, శాసనసభలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థుల ప‌ప్పులేవి ఉడ‌క‌వు. . ఎందుకంటే, ఒక్కో అభ్యర్థి ఒక్కో స్థానం కోసం మాత్రమే పోటీ చేయాలన్న ప్రతిపాదనలకు భారత ఎన్నికల సంఘం మద్దతు తెలుపుతున్నట్టు సుప్రీంకోర్టుకు నివేదించింది.

ఒక అభ్యర్థి ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా చూడాలని కోరుతూ ఓ ప్రజాప్రయోజనం వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన అభ్యర్థులు ఒక నియోజకవర్గాన్ని వదిలి మరో నియోజకవర్గానికి వెళ్లడమంటే ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్ప‌టి నుంచి అభ్య‌ర్తులు పార్ల‌మెంట్ లేదా అసెంబ్లీస్థానాల్లో ఏదొ ఒక దానినుంచే పోటీ చేయ‌క త‌ప్ప‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -