Thursday, May 2, 2024
- Advertisement -

మోడీజీ ..సరికొత్త డిక్షనరీ !

- Advertisement -

రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విమర్శలు చేయడం షరా మామూలే.. ప్రభుత్వ పార్టీపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అలాగే ప్రతిపక్ష పార్టీలపైనా ప్రభుత్వ పార్టీలు కౌంటర్లు వేయడం మనం రోజు చూస్తూనే ఉంటాం. అయితే ఒక్కో సారి ఇరు పక్షాల మద్య విమర్శలు తారస్థాయికి చేరి ఒకరినొకరు భూతులు తిట్టుకునే వరకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు ఇలా భూతులు తిట్టుకోవడానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా అసెంబ్లీలోనే ప్రజాసమస్యలకు బదులుగా భూతు మాటల గురించి చర్చించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సరే.. ఏపీ విషయాన్ని అలా పక్కన పెడితే కేంద్రంలో కూడా లోక్ సభ సమావేశాలలో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు కొంతమంది నేతలు.

ఇలా ఆన్ పార్లమెంటరీ పదాలు వాడడం వల్ల ప్రజల్లో .. ప్రజా ప్రతినిధులపై ఉండే అభిప్రాయం సన్నగిల్లుతుంది. దాంతో నేతలు లోక్ సభ వంటి సమావేశాలలో మాట్లాడే భాషపై నియంత్రణ తీసుకు వచ్చేందుకు మోడీ సర్కార్ కొన్ని సాధారణ పదాలను కూడా ఆన్ పార్లమెంటరీ వర్డ్స్ జాబితాలోకి చేర్చి లోక్ సభ సెక్రటేరియట్ తో ఒక బుక్ లెట్ ను విడుదల చేయించింది. అయితే ఈ ఉత్తర్వులపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మోడీ ప్రభుత్వ పాలనను వర్ణించడానికి ఉపయోగించే అన్నీ పదాలను కూడా ఆన్ పార్లమెంటరీ జాబితాలోకి చేర్చండి అంటూ కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. నవ్య భారత్ కు సరికొత్త డిక్షనరీ అంటూ రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రాలు అంధించారు. పార్లమెంట్ లో సాధారణంగా వాడే పదాలపై కూడా నిషేధం విధించడం ఏంటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రెయిన్ ప్రశ్నించారు. ఇలా విపక్షాల నుంచి మోడీ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

అసలు ఏ ఏ పదాలను ఆన్ పార్లమెంటరీ వర్డ్స్ జాబితాలోకి చేర్చారో ఒకసారి చూద్దాం..అబ్యూజ్‌డ్‌ (దుర్భాషలాడు), అహంకార్‌ (గర్విష్టి), అషెమ్‌డ్‌ (సిగ్గుచేటు), బిట్రేయ్‌డ్‌ (ద్రోహి), కొవిడ్‌ స్ప్రెడర్‌ (కరోనా వ్యాప్తిదారి), చంచా (సాగిలపడేవ్యక్తి), చీటెడ్‌ (మోసం చేయడం), కరప్ట్‌ (అవినీతిపరుడు), కొవర్డ్‌ (పిరికివాడు), క్రిమినల్‌ (నేరగాడు), క్రొకడైల్‌ టియర్స్‌ (మొసలికన్నీరు), డిక్టోరియల్‌ (నియంతృత్వం), డ్రామా (నాటకం), ఫూలీష్‌ (మూర్ఖుడు), గూన్స్‌ (గూండాలు), హిపోక్రసి (వంచన), ఇన్‌కంపిటెంట్‌ (అసమర్థుడు), జైచంద్‌ (దేశద్రోహి), జుమ్లాజీవి (అబద్దాలకోరు), ఖలిస్తానీ, శకుని, తానాషా (నిరంకుశుడు). ఇంకా చాలా పదాలనే ఆన్ పార్లమెంటరీ వర్డ్స్ జాబితాలోకి చేర్చారు. ఇలా సాధారణ పదాలను కూడా ఆన్ పార్లమెంటరీ వర్డ్స్ జాబితాలోకి చేర్చితే.. మరి ఏపీ నేతలు అసెంబ్లీలో తిట్టుకునే బూతులను ఏ జాబితాలోకి చేర్చాలో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వర్షాలు.. విదేశీ కుట్రలు అంటున్న కే‌సి‌ఆర్ !

ప్రధాని సెటైర్స్.. ఎవరిపై ?

ఈటెల బీజేపీ కి గుడ్ బై ..చెప్తాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -