Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీలో రీపోలింగ్ జ‌ర‌గ‌నున్న ప్రాంతాలు..

- Advertisement -

ఈ నెల ఏపీలో 11న జ‌రిగిన పోలింగ్ స‌మ‌యంలో అక్క‌డ‌క్క‌డా కొన్ని హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా సాగింది. ఈసారి దాదాపు 80 శాతం పోలింగ్ న‌మోద‌య్యింది.అధికార,ప్రతిపక్ష పార్టీలు పలు ప్రాంతాల్లో దాడులకు దిగాయి. అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీల మధ్య చెలరేగిన ఘర్షణ పోలింగ్ పై ప్రభావం చూపడంతో రెండు చోట్ల ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు సిద్ధమైంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ బూత్ తో పాటు నరసారావుపేటలోని 94వ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. గుంటూరు కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈ రీపోలింగ్ కు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ వార్డులో పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల సమయం ముగిసినా ఓటర్లు క్యూలైన్ లో ఉండటంలో అధికారులు 300 స్లిప్పులను అందజేశారు. అయితే పోలింగ్ కేంద్రం ప్రాంగణానికి ప్రహరి లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు చాలామంది క్యూలైన్లలోకి చొరబడ్డారు. స్లిప్పులు లేకుండానే ఓటు వేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన క‌లెక్ట‌ర్ రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘానికి నివేదిక ఇచ్చారు.

రసారావుపేటలోని కేసానుపల్లి గ్రామంలోని 94వ బూత్ లో పీవో తప్పిదం వల్ల రీపోలింగ్ అనివార్యమైంది. బూత్ లో మాక్ పోలింగ్ సందర్భంగా 50 ఓట్లు వేశారు. వీవీ ప్యాట్ లో 50 స్లిప్ లను తొలగించారు. అయితే మాక్ పోలింగ్ తర్వాత ఓట్లను ఈవీఎంలలో తీసివేయలేదు. తనిఖీల్లో 50 ఓట్లు ఎక్కువ రావడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి రీపోలింగ్ కు ఆదేశాలిచ్చారు. దీంతో రెండు ప్రాంతాల్లో రీపోలింగ్‌కు సిద్దం అయ్యింది ఈసీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -