- Advertisement -
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో పట్టణానికి బయలుదేరిన ఈజిప్టు ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అదృశ్యమైంది. దీంతో రెండు దేశాల్లో కలకలం ప్రారంభమైంది.
ఈ విమానంలో 59 మంది ప్రయాణీకులు, పది మంది విమాన సిబ్బంది ఉన్నారు. పారిస్ నుంచి నిన్న రాత్రి బయలుదేరిన విమానం గురువారం ఉదయం మూడు గంటలకు ఈజిప్టు చేరుకోవాలి. అయితే ఇప్పటివరకూ అది గమ్యం స్ధానం చేరలేదు. దీంతో విమానం అదృశ్యమైనట్లుగా ఈజిప్టు ప్రభుత్వం తన ట్విట్టర్ లో పేర్కొంది.
