Sunday, May 5, 2024
- Advertisement -

వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం…ఫ్లైట్‌లో వైఎస్ విజయమ్మ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఈరోజు భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది.హైదరాబాద్ — విజయవాడ ఏయిర్ ఇండిగో విమానానికి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ల్యాండింగ్ కు సహకరించడంలేదు. దీంతో గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానం అక్కడక్కడే గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆ విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఉన్నట్లు సమాచారం. దీంతో విమాన ల్యాండింగ్ కు ఇంజన్ లో ఎలాంటి సాంకేతిక పరమైన లోపం తలెత్తిందా లేక వర్షం వల్లనే విమానం ల్యాండింగ్ కు సహకరించడంలేదా అనే టెన్షన్ నెలకొంది.హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరే సమయంలో వాతావరణం బాగానే ఉన్నప్పటికీ గన్నవరంకు చేరుకునే సమయానికి వాతావరణం మారిపోయింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో విమానం దించేందుకు ఇండిగో పైలెట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

గతంలో కూడా వర్షంతో పాటూ వాతావరణం సహకరించకపోవడం వల్ల పలు విమానాలు.. విమానాశ్రయంలో కాకుండా ఎయిర్ పోర్టు హైవే దాటిన సందర్భాలు ఉన్నాయి. ఆ సయమయంలో ఫైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ల్యాండ్ చేయగా, మరి కొన్ని విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతం విమానాన్ని సేఫ్ గా దింపేందుకు పైలెట్లు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -