- Advertisement -

ఏపీ ప్రజల చెవుల్లో తేనె పోసిన బాబు..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ నంబర్లను చెప్పారు. ఏపీలో పెట్టుబడుల గురించి ఆయన ఈ ప్రకటన చేశాడు.

ఇప్పటి వరకూ కుదిరిన ఒప్పందాల ప్రకారమే ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన ఊరడిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని..దీంతో అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని బాబు వివరించారు.

విశాఖ పట్నంలో ఇండస్ట్రియల్ మిషన్ ను ప్రారంభిస్తూ బాబు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వానికి దాదాపు 46 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని బాబు వివరించారు. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని బాబు వివరించారు. వీటి తో దాదాపు 72 వేల మందికి ఉపాధి దొరుకుతుందని బాబు ప్రకటించారు. 

వివిధ కంపెనీలు ఏపీలో కొత్తగా 48 యూనిట్లు ప్రారంభించనున్నాయని బాబు వివరించారు. భారత వృద్ధిరేటు ఆమోఘంగా ఉందని.. బాబు ఇంకా ఏవేవో చెప్పారు అవన్నీ ఎలా ఉన్నా కానీ.. భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రకటించడం వరకూ అయితే ఏపీ ప్రజలను ఆనందపెట్టే వార్తే. అయితే ఇది కేవలం ఊరడింపు వార్తనా.. లేక నిజంగానే ఆ స్థాయిలో పెట్టుబడులు ఏపీకి వస్తాయా.. అనే అంశాన్ని వేచి చూసి తెలుసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -