Friday, May 17, 2024
- Advertisement -

అతిధి గా పెళ్ళికి వెళ్లి వరుడుగా ఇంటికొచ్చాడు

- Advertisement -

ఎవరిదో బంధువుల పెళ్ళికి అని వెళ్లి ఆ మండపం లో కూర్చున్న పెళ్లి కూతురుకి తాళి కట్టి మొగుడు అయిపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి వింత పరిస్థితి తలచుకుంటే నే ఆశ్చర్యం వేస్తోంది కదూ,

మరి ఒకతను సరిగ్గా ఇలాంటి పనే చేసాడు. వివరాలు చూస్తే తమిళనాడు లో నాగర్ కోయిల్ దగ్గరి వడివీవ్వరం అనే ఊర్లో ఆలగమ్మాల్ ఆలయం లో మనికంఠ , ఉమా ప్రియ అనే యువతి మధ్య పెద్దలు శుభముహూర్తం నిర్ణయించి పెళ్లి పీతల మీద కూర్చో పెట్టారు. ఈ వివాహం జరుగుతున్నా గుడి ఆచారం ప్రకారం ఈ వివాహం తమకి మొట్టమొదటి వివాహమే అని అమ్మవారికి నిర్ధారణ పత్రం ఇచ్చి తీరాలి, పంతులు గారూ, గుడి పెద్దలూ ఇచ్చిన కాగితం లో వదూవరులు సంతకం చెయ్యాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి లో ఎవరి గురించి వారు తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటే అది పెద్ద పాపం గా అమ్మవారి దృష్టి లో పడుతుంది కాబట్టి అక్కడ అమ్మ వారిని శిక్షిస్తుంది అని వారి నమ్మకం. సో ఇంతకు ముందే పెళ్లి అయినట్టు ఉంది ఆ కుర్రాడు పెళ్లి చేసుకోవడం, సంతకం  కోసం నిరాకరణ తెలిపాడు. దీంతో అప్పటికే లక్షలలో పెళ్లి ఖర్చు పెట్టాము కాబట్టి ఆ  ఇవాలి అని వధువు తల్లి తండ్రులు డిమాండ్ చేస్తూ పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు రంగం లోకి దిగి వరుడిని అతని కుటుంబాన్నీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు.                                                                   

అక్కడ కూడా సంతకాలు చేసే అవసరం లేదంటేనే పెళ్లికి సిద్ధమని వరుడు చెప్పాడు. వివాహం ఆగకూడదని భావించిన పెళ్లి పెద్దలు, దాన్ని చూసేందుకు వచ్చిన గోపకుమార్ అనే యువకుడితో చర్చించి పెళ్లికి ఒప్పించారు. గోపకుమార్ సైతం ఉమాప్రియను పెళ్లాడేందుకు అంగీకరించడం, ఆపై సంతకాలు, ఘనంగా వివాహం జరిగిపోయాయి. మణికంఠన్ కు ఇదివరకే పెళ్లి జరిగివుండవచ్చని, అమ్మవారికి భయపడే సంతకం చేసేందుకు వెనుకంజ వేశాడని, ఇదీ ఒకందుకు మంచిదే అయిందని పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు సంతోషపడటం కొసమెరుపు. దీంతో అప్పటికప్పుడు వధువు కు దూరపు బంధువు అయిన యువకుడు ఒకతను ముందుకు వచ్చి పిల్ల పెద్దవాళ్ళతో  చర్చించి పెళ్ళికి సిద్దం అని ఒప్పుకుని తాళి అందుకున్నాడు .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -