Sunday, May 5, 2024
- Advertisement -

లోకేష్ పరిస్థితి ఏంటి ?

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేష్ బాబు భవితవ్యంపై తర్జనభర్జ పడుతున్నారు. చినబాబు మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు గానీ స్టేట్ లోనా…లేక సెంట్రల్ లోనా అనే విషయాన్ని చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు.

లోకేష్ కు మంత్రి పదవి వరిస్తుందని ముందుగానే పార్టీ నేతలతో చెప్పించిన చంద్రబాబు… తన కుమారుడిని సెంట్రల్ కు పంపితే.. ఎన్డీఏ సర్కారులో కీలక పదవి ఇప్పించుకోవచ్చని మొదట భావించారు. అందుకు రాజ్యసభ ఎన్నిక కూడా రెడీగా ఉంది. అయితే మొదట్లోనే నామినేటెడ్ సభ్యుడిగా చేస్తే తెలుగు ప్రజలకు లోకేష్ సత్తా ఎలా తెలుస్తుంది సార్…అని కొందరు తెలుగు తమ్ముళ్లు బాబుగారి చెవిలో ఊదటంతో ఆలోచనలో పడ్డారట.

నిజమే కేసీఆర్ తనయుడు కేటీఆర్, వైఎస్ఆర్ తనయుడు జగన్ లాగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే లోకేష్ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది కదా అని అనుకుంటున్నారట చంద్రబాబు. అయితే లోకేష్ బాబు కోసం చంద్రబాబుకు వీరవిధేయుడైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన పదవికి సైతం రాజీనామాకు  రెడీ అంటున్నారు. ఏపీ టీడీపీ సీనియర్లు చినబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుందామని అంటుంటే.. తెలంగాణ  నాయకులు లోకేష్ సెంట్రల్ వెళ్తేనే బాగుంటుందని సలహా ఇస్తున్నారట.  చినబాబు కేంద్రానికి వెళితేనే తెలంగాణలో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని రేవంత్ రెడ్డి లాంటి వారు బాబు సజెస్ట్ చేస్తున్నారట.

లోకేష్ సెంట్రల్ లో ఉంటే తెలుగు తమ్ముళ్లు హైదరాబాద్‌లోనూ ధైర్యంగా ఉండొచ్చని కూడా చెబుతున్నారట.   తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లలాంటివని చెప్పుకునే చంద్రబాబు కొడుకు భవితవ్యం విషయంలో ఎవరి మాట వింటారనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణ నేతలు చెబుతున్నట్లుగా చినబాబును సెంట్రల్ కు పంపితే ఇప్పుడప్పుడే పార్టీపై గ్రిప్ రాదన్న సలహాలిచ్చే వారు కూడా ఉన్నారు. మరి లోకేష్  ఏపీ కేబినెట్ లో చేరితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా ఊహించలేం.. ఇదివరకే తెరవెనక రాజకీయం నడిపి ఫ్రెండ్స్ ను ప్రభుత్వ ఓఎస్డీలు గా ఉంచిన లోకేష్… ఏకంగా కేబినెట్ మంత్రి అయితే ఇతర శాఖల్లోనూ వేలుపెట్టొచ్చని కొందరు మదనపడుతున్నారు. మరి ఫైనల్ గా బాబు నిర్ణయం ఎలా ఉంటుందో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -