Saturday, April 27, 2024
- Advertisement -

50 దాటారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -

మారుతున్న జీవన శైలీ,ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అంతా అనారోగ్యానికి గురవుతున్న వారే. పట్టుమని 50 ఏళ్లు కూడా నిండటం లేదు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలతో మృత్యువాత పడుతున్నారు.

ఈ క్రమంలో 50 ఏళ్లు దాటిన వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఎంతోమంచిది. రోజుకు ఖచ్చితంగా 30 నిమిషాల నడక, వ్యాయామం తప్పనిసరి. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది.

నలుగురితో కలిసి ఉండటం ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. హాయిగా నిద్రపోవడం ఎంతో మంచిది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మానసిన ప్రశాంతతే కాదు ఆరోగ్యంగా ఉండవచ్చు. మితిమీరిన ఆల్కహాల్ సేవించడం ఈ వయస్సులో మంచిదికాదు. డిప్రెషన్ లక్షణాలను కలిగిఉంటే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడం వల్ల ప్రతికూల ఆలోచనల నుండి బయటపడవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -