- Advertisement -

హిందూమత పున:స్వీకరణ మహోత్సవం..

- Advertisement -

తిరుపతిలో హిందూమత పునఃస్వీకరణ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుపతి పి.కే. లేఅవుట్‌కు చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో జరిగింది.యాలమూరి శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు 27 ఏళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడ ఇస్లాం మతాన్ని స్వీకరించి
అబ్దుల్లా, అమీనా పేర్లతో జీవించారు.

2015లో భారత్‌కు తిరిగి వచ్చిన ఈ దంపతులు, ఇప్పుడు మళ్లీ హిందూ మతాన్ని స్వీకరించారు. ఈ పునఃస్వీకరణ కార్యక్రమం భూమన ప్రోత్సాహంతో నిర్వహించబడింది. హోమాలు, సంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భూమన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు, మత స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయాలపై చర్చను మళ్లీ ముందుకు తీసుకువచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -