భారత్,చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రెండు దేశాలు వెనక్కు తగ్గకపోవడంతో ఎప్పుడు ఏంజరుగుతోందోనని ఉత్కంఠనెలకొంది.1962 నాటి యుధ్దపరిస్థితులను గుర్తుంచుకోవలని చైనా హెచ్చరికలకు భారత్ అంతే రీతిలో బదులు ఇచ్చింది.
ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి సిద్దంగా ఉన్నాయి.ఒక వేల యుధ్ధం వస్తే చైనాను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఎంతవరకుఉంది అనేది ప్రశ్న…?
చైనాతో భారత్‌కి ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలున్నా ఇంతటి తీవ్ర స్థాయిలో లేవు.ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చైనా, కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌తో యుద్ధానికి ‘సై’ అంటోంది.అరుణాచల్ ప్రదేశ్‌లలో చైనా – భారత బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే ఇరు దేశాల మధ్య ఇంతవరకూ వివాదం కాల్పులదాకా వెళ్ళలేదు.
{loadmodule mod_custom,GA1}
ఈ పరిస్థితుల్లోనే ఆయుధ సంపత్తి విషయంలో చైనాతో పోల్చితే మనమెక్కడున్నాం.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. 1962 నాటి పరిస్థితుల్ని చైనా ఉదహరిస్తోందిగానీ, ఆ యుద్ధమే ఆయుధ సంపత్తి పరంగా భారత్ కనీ వినీ ఎరుగని వేగంతో దూసుకెళ్ళేలా చేసిందన్నది నిర్వివాదాంశం.
చైనాతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకునే క్రమంలో భారత్ కూడా బాగానే ‘అభివృద్ధి’ చెందింది.ఇరు దేశాలు అణ్వస్త్ర ఆయుధాలను కలిగి ఉన్నాయి.అందుచేత చైనా సహసం చేయకపోవచ్చు.రెండు దేశాల అమ్ములపొదిలోనూ అత్యాధునిక యుద్ధ విమానాలు, అణ్వ్రస్త సామర్థ్యమున్న క్షిపణులు, అణు జలాంతర్గాములు, యుద్ధ విమాన వాహక నౌకలూ.. వంటివన్నీ వున్నాయి. సమ ఉజ్జీ కాకపోయినా, చైనా అత్యుత్సాహం చూపిస్తే, బుద్ధి చెప్పగల సత్తా అయితే భారతదేశానికి వుంది.అది చైనాకు కూడా తెలుసు.
ఎట్టిపరిస్థితుల్లోను చైనాను నమ్మడానికి లేదు.ఆర్థికాభివృద్దిలో దూసుకుపోతున్న బారత్‌ను మానసికంగా,ఆర్థికంగా దెబ్బతీయడానికి అత్యుత్సాహం అనుకోవచ్చు.ఎప్పటికైనా పాకిస్థాన్ మాదిరి పక్కలో బల్లేంలా తయారవడంలో సందేహంలేదు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}wWnpSsaZ5-I{/youtube}
