- Advertisement -

ఎట్ హోంలో ప‌వ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌…

- Advertisement -

70 వ‌ణ‌తంత్ర దినోత్స‌వం పుర‌స్క‌రించుకొని తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ రాజ్‌భ‌వ‌న్‌లో ఎట్ హోం కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలంగాణాసీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం కేయి కృష్ణ‌మూర్తి కూడా హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిక‌ర ప‌నిణామాలు చోటు చేసుకున్నాయి.

ప్ర‌ధానంగా ప‌వ‌న్‌, కేసీఆర్ లు ప‌క్క ప‌క్క‌నే కూర్చొని చాలా సేపు చ‌ర్చించుకున్నారు. రాజకీయ చర్చలకు కూడా ఎట్ హోం కార్యక్రమం వేదికైంద‌నే చెప్పాలి. ఏపీ రాజకీయాలపై పవన్ కళ్యాణ్‌తో కేసీఆర్ తో చర్చించినట్టు సమాచారం. కేటీఆర్, జగన్ సమావేశం గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

ఏపీలోని రాజకీయ పరిస్థితులపై గులాబీ దళపతి, జనసేనాని మధ్య చర్చలు కొనసాగాయి… ఈ సమయంలో పక్కనే కూర్చుకున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా ఫెడరల్‌ ఫ్రంట్‌లో వైఎస్ జగన్‌పై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేటీఆర్ -జగన్ భేటీపై కూడా పవన్ కల్యాణ్ కామెంట్ చేసినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -