Sunday, May 19, 2024
- Advertisement -

తెలుగుదేశం లో రెడ్డి కులస్తులను తొక్కేస్తున్నారా?!

- Advertisement -

రేవంత్ రెడ్డి ఏదో ఉపయోగపడుతున్నాడు కాబట్టి.. అతడికి ఉత్తమాటలు చెప్పి ఊరడిస్తున్నారు. బాగా వాడేసుకొంటున్నారు. తీరా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొంత బలపడినా.. వచ్చే ఎన్నికల్లో అంతో ఇంతో సత్తా చాటినా.. రేవంత్ ను పక్కన పెట్టేయడం అనేది కొన్ని నిమిషాల్లో జరిగేపని అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వీళ్ల అంచనా ప్రకారం.. విశ్లేషణల ప్రకారం.. తెలుగుదేశం పార్టీలో రెడ్డి కులస్తులు ఎదగడం అనేది జరిగే పని కాదు! తెలుగుదేశం పార్టీ అధినేత ఈ కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడడు.. అనేది వీరి అభిప్రాయం. 

దీనికి అనేక ఉదాహరణలను చూపుతున్నారు. అనంతపురం జిల్లా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాను.. నాకు కేంద్రం లో ఏదైనా సహాయ మంత్రి పదవిని ఇప్పించండి.. అని బాబును అడుగుతున్నాడు. అయితేఅది దక్కలేదు. ఆఖరికి ఏదైనా కాస్త పవర్ ఉన్న నామినేటెడ్ పదవిని అయినా ఇప్పించమని బాబును కోరుతున్నాడు. ఆయి తే జేసీకి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు.

ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్లు అయితే ఎమ్మెల్సీ పదవి కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. జగన్ రెడ్డిపై ధ్వజమెత్తడానికి ఒక రెడ్డి ఉండాలనే నియమం కింద సోమిరెడ్డి చేత బాబు దుమ్మెత్తిపోయిస్తారు కానీ.. ఆయనకు ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.

బాబు క్యాబినెట్ లో పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాల కృష్ణరెడ్డి లాంటి వాళ్లు ఉన్నా.. వారిది నామమాత్రపు ప్రాధాన్యత. బాబుకుఅడుగులకు మడుగులు ఎత్తే వాళ్లకే ఆ ప్రాధాన్యత. కడప జిల్లాలో ఇద్దరు రెడ్లు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తే చివరకు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చి సరిపుచ్చారు. సతీష్ రెడ్డి స్థాయితో చూసుకొంటే అది చాలా తక్కువ ప్రాధాన్యత!

ఇలా చెప్పుకొంటే పోతే తెలుగుదేశం పార్టీలో రెడ్ల వ్యథలు అన్నీ ఇన్నీ కావు. అదేంటి అంటే.. తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి పెద్ద గా ఇష్టం చూపని కులానికి చెందిన వారికి ఈపార్టీలో ప్రాధాన్యత ఎలా దక్కుతుంది? అని టీడీపీ నేతలే ఎదురు ప్రశ్నిస్తారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -