- Advertisement -

పిఠాపురంలో జ‌నసేన నేత‌ల వీరంగం..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామంలో జరిగింది. డ్రైనేజీ నిర్మాణం విషయమై ప్రారంభమైన వివాదం క్రమంగా తీవ్ర ఘర్షణకు దారి తీసింది.

సమాచారం ప్రకారం, సుమారు పది రోజుల క్రితం ఊటా రాంబాబు తన ఇంటి వద్ద డ్రైనేజీ ఏర్పాటు చేయొద్దని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఊటా శ్రీను ఆయనతో వాగ్వాదానికి దిగగా, ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఆ సమయంలో ఊటా శ్రీను రాంబాబుపై చేయి చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, నిన్న రాంబాబును శ్రీను వర్గీయులు అడ్డగించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ఇరు వర్గాలు కత్తులు, రోడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా ఇరు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

https://twitter.com/Telugufeedsite/status/2033410904302436483

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -