Saturday, May 4, 2024
- Advertisement -

ఓటింగ్‌కు దూరంగా ఆ ఊరు….

- Advertisement -

క‌ర్ణాటక ఓటరు తీర్పు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆ గ్రామం మాత్రం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు కల్‌బూరగి జిల్లాలోని చిత్తాపూర్ తాలుకా తార్కస్‌పేట్ గ్రామ ప్రజలు ఎన్నిక‌ల‌ను తిరస్క‌రించారు. ఎందుక‌నుకుంటున్నారా…? దానికి ప్ర‌ధాన‌మైన కార‌నం ఉంది.

గ్రామ ప్ర‌జ‌లు త‌మ ఊర్లో మ పంచాయతీ భవనం నిర్మించడం లేదని వాళ్లు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయితీని నిర్మించాల‌ని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొర పెట్టుకున్నారు. కానీ ఆ గ్రామ ప్రజల మొరను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామపంచాయతీ భవనం కట్టించే వరకూ ఓటేయబోమని ఆ గ్రామ ప్రజలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఆ గ్రామంలో మొత్తం 3500 మంది జనాభా ఉన్నారు. గ్రామానికి నేటి వరకూ పంచాయతీ భవనమే లేదంటే.. ఆ ఊర్లో అభివృద్ధి ఏ తీరున ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -