తెలంగాణ రాష్ట్రా ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది.తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు స్పష్టమైన మెజార్టీ ఇవ్వడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.టీఆర్ఎస్ పార్టీ దాదాపు 90 నుంచి 100 సీట్ల లోపు గెలిచే అవకాశం ఉంది.ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు షాక్ ఇచ్చారు.కోమట్ రెడ్డి,జనారెడ్డి,రేవంత్ రెడ్డి,కొండ సురేఖ,డీకే అరుణ వంటి నేతలు కూడా ఓటమి పాలైయ్యారు.
ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో కేసీఆర్ ప్రభుత్వన్ని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు.కేసీఆర్ రేపు(బుధవారం) ఎల్‌బి స్టేడియంలో వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్రా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతక ముందే వెలువడింది.దీంతో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది.
- హనీమూన్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
- కేబినెట్ సమావేశానికి మళ్లీ పవన్ గైర్హాజరు
- మరో పోరాటానికి సిద్దమైన వైసీపీ, ముహూర్తం ఫిక్స్..
- రంగనాథ్‌ను అరెస్ట్ చేయండి?
- విద్యార్థులకు మద్దతు.. సల్మాన్ ఖాన్ పై ట్రోల్స్..
