Friday, March 29, 2024
- Advertisement -

కుకట్ పల్లి ట్రాఫిక్ ని క్లియర్ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

హైదరాబాద్ కుకట్ పల్లి లో ట్రాఫిక్ సంగతి అందరికీ తెలిసిందే. గంటలకి గంటలు పడుతుంది జీఎన్ టీయూ నుంచి మియాపూర్ వైపు గానీ హైటెక్ సిటీ వైపు గానీ వెళ్ళాలి అంటే. అయితే ఈ ట్రాఫిక్ కి సంబంధించి ఎందఱో పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నా కూడా ఇదే పరిస్థితి. చివరికి ఆ ఏరియా ఎమ్మెల్యే స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చెయ్యాల్సి ఒచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్ కూకట్ పల్లి నియోజికవర్గా తెరాస ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు కూకట్ పల్లి లోని ప్రధాన ప్రాంతాల్లో స్వయంగా తిరిగారు. అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏ మేరకు ఉన్నాయి అనేదాని మీద దృష్టి పెట్టిన ఆయన ట్రాఫిక్ నియంత్రణ మీద సూచనలు చేసారు. గుంతలు పడిన రోడ్లు పూడ్చాలని అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చెసి స్వయంగా మునిసిపల్ సిబ్బంది తో మాట్లాడారు.

మలేషియా టౌన్ షిప్ మీదగా వివేకానంద నగర్ వెళ్ళే దారిలో సాయంత్రం పూట గంటలకి గంటలు ఎందుకు ట్రాఫిక్ జాం అవుతోంది అనేది తెలుసుకోవడం కోసం ఆకాస్మిక తనిఖీ చేసారు ఆయన. కృష్ణారావు ఆ రోడ్ల మీద హడావిడిగా తనిఖీలు చేస్తుంటే పోలీసులు, అధికారులు ఆయన వెనకాల పరిగెట్టడం కనిపించింది. నిధుల ఇబ్బంది కూడా ఉంది అనీ రోడ్ల కోసం కష్టపడుతున్నాం అని అధికారులు చెప్పగా స్పాట్ లో ఇరవై లక్షలు మంజూరు చేసారు ఆయన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -