- Advertisement -

శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం

- Advertisement -

శ్రీశైల మహాక్షేత్రంలో చోటుచేసుకున్న ఘటన భక్తుల్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. శ్రీశైల ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా స్వామి–అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించకపోవడం అపచారంగా భావిస్తున్నట్లు భక్తులు మండిపడుతున్నారు. సంప్రదాయంగా ఏటా భక్తిశ్రద్ధలతో జరగాల్సిన స్వామి అమ్మవార్ల వాహనసేవ, గ్రామోత్సవాన్ని ఈసారి దేవస్థానం అధికారులు రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది.

అలయంలో క్యూలైన్లలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఉత్సవమూర్తులను రాజగోపురం వెలుపల ఊరేగించలేమని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంతో పురవీధుల్లో జరగాల్సిన గ్రామోత్సవాన్ని ఆలయ ప్రాంగణానికే పరిమితం చేశారు. అయితే ఈ నిర్ణయం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పలువురు శివభక్తులు అంటున్నారు.

గ్రామోత్సవం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని భక్తులు గుర్తుచేస్తున్నారు. అలాంటి పుణ్యకార్యాన్ని నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని, ఇది స్వామి అమ్మవార్లకు అపచారమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తున్నారు.

దేవస్థానం అధికారులు తమ బాధ్యతను విస్మరించారని, భక్తుల విశ్వాసాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, సంప్రదాయాలు, ఆచారాలకు గౌరవం ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -