శ్రీశైలం భమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు.
ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు వేదపండితులు. శ్రీశైలాన్ని తొలిసారి సందర్శించారు ప్రధాని మోదీ. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ,శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించచారు ప్రధాని.
ఇక అంతకముందు కర్నూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. మంత్రి లోకేశ్‍ను చూసి ఆశ్చర్యంగా ఉందన్నారు మోదీ. లోకేశ్ చాలా బరువు తగ్గావన్న ప్రధాని”..త్వరలో మీ నాన్న గారిలా తయారవుతావని లోకేశ్‍ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రధాని.. ఆ వ్యాఖ్యలు చేస్తునే నవ్వారు మోదీ. .ప్రధాని వ్యాఖ్యలకు చిరునవ్వులు చిందించారు చంద్రబాబు, లోకేశ్.
