Tuesday, May 14, 2024
- Advertisement -

కేసీఆర్ ఫొటో మార్ఫింగ్‌తో జైలుపాలు

- Advertisement -
ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుకు ఎలా నిర‌స‌న చెప్పాలో తెలియ‌దు.. ఈ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేకంగా పాలిస్తుందోన‌ని ఒక సామాన్యుడు చెప్ప‌డానికి ప‌స్త్రుత ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో సామాన్యుల‌కు ఉన్న ఒకే ఒక ఆయుధం సోష‌ల్ మీడియా. ఆ సోష‌ల్ మీడియా మ‌న అభిప్రాయం చెబుతుంటాం. ఆ విధంగానే ఓ యువ‌కుడు తెలంగాణ ప్ర‌భుత్వంపై త‌న అభిప్రాయం పంచుకొని కొంచెం కేసీఆర్ కుటుంబానికి వ్య‌తిరేకంగా ఒక ప‌ని చేశాడు. అదే ప‌ని ఇప్పుడు ఆ యువ‌కుడు జైలు పాల‌య్యేలా చేసింది.
మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం ర‌వి అలియాస్ రాథోడ్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఫొటోను అసభ్యకర రీతిలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటో పోస్టు చేస్తూ ‘స్టూవర్టుపురం దొంగల ముఠా’ అని రాసి ఫేస్‌బుక్‌లో పలువురి ఖాతాలకు పోస్టు చేశాడు. ఈ విష‌యం గ‌మ‌నించిన స్థానిక టీఆర్ఎస్ నాయ‌కులు మండిప‌డ్డారు. వెంట‌నే ఆ యువ‌కుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువ‌కుడిని బ‌య్యారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాథోడ్‌ భాయిపై ఐపీసీ 153ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై సైబర్‌ క్రైమ్‌ కింద కేసులు నమోదు చేస్తామని సీఐ రవి హెచ్చ‌రించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -