టీడీపీ కంచు కోట పశ్చిమగోదావరి జిల్లాలో ఆధిపత్య పోరు మళ్ళీ మొదటికి వచ్చింది. మొన్న మొన్నటి వరకూ ఈ వ్యవహారం దాదాపు సైలెంట్ అయిపోయినట్టే అయిపోయి మళ్ళీ మొదలు అయ్యింది. మిత్ర పక్షాలు అయిన టీడీపీ – బీజేపీ నేతల మధ్యన విభేదాలు భగ్గుమన్నాయి.
రెండు వర్గాల వారు మీరు లేకపోతే మేము లేము, కాదు మా వల్లే మీరు గెలిచారు అంటూ రోడ్డు మీద పడి మరీ కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే – ఏపీ దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు – నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి – పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది.
2014 ఎన్నికల్లో మాణిక్యాలరావు గెలిచారంటే అది తమ చలవేనని – తాము మద్దతు ఇవ్వకపోతే ఆయన గెలిచేవారు కాదని టీడీపీ ప్రచారం చేస్తూ వస్తోంది. తమ్ముళ్ల మద్దతు లేకపోయినా గెలిచేవారమని.. నరేంద్ర మోడీ హవాతోనే తాము విజయం సాధించామని బీజేపీ కౌంటర్ ఇస్తూ వస్తోంది
