Friday, May 3, 2024
- Advertisement -

ట్రిపుల్ త‌లాక్‌పై యోగి సంచ‌ల‌న కామెంట్స్‌

- Advertisement -
End silence on triple talaq, says Yogi Adityanath

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యేగి ఆదిత్యానాథ్  ఏంమాట్లాడినా సంచ‌ల‌న‌మే.  ఈ యువ సీఎం ఇప్పుడ దేశంలో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ ఆడ్ర‌స్‌గా మారారు. ప్ర‌భుత్వ ప‌రంగా ఏనిర్ణ‌యం తీసుకున్నా అది దేశంలో సంచ‌ల‌నం క‌లిగించేది.దేశ వ్యాప్తంగా ముస్లింల వివాహానికి సంబందించిన ట్రిపుల్ త‌లాక్‌పై  విష‌యంలో మౌనం వ‌హించిన నేత‌ల‌పై దిమ్మ‌తిరిగే పంచ్ విశిరారు.  ట్రిపుల్‌ తలాక్‌పై మౌనాన్ని మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంతో పోల్చాడంతో దేశ వ్యాప్తంగా  సంచ‌ల‌నం  రేపుతోంది.  ట్రిపుల్‌ తలాక్‌కు మద్దతిచ్చే వారితో పాటు మౌనంగా ఉన్న వారు కూడా నేరస్తులే అని వ్యాఖ్యానించారు. 

ఈ పరిస్థితికి కారణం మ‌హాభార‌తంతో   ద్రౌపది వస్త్రాపహరణ  స‌మ‌యంలో అక్కడున్న వారిని ప్రశ్నిస్తుంది. దానిపై  ఎవ్వరూ ఒక్కమాట కూడా మాట్లాడ‌రు.    ఒక్క విదురుడు మాత్రమే స్పందిస్తూ.. నేరానికి పాల్పడిన వారితో పాటు ఆ నేరానికి మద్దతిచ్చినవారు..మౌనంగా ఉన్నవారు అందరూ బాధ్యులే అనే  సమాధానమిస్తాడు’ అని ట్రిపుల్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన వివరించారు. సోమవారం మాజీ ప్రధాని చంద్ర శేఖర్‌ 91వ జయంతి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌కు అంతం పలకాలని,  దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయాలని పేర్కొన్నారు.

యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు అవివేకమని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) విమర్శించింది. ఏఐపీఎల్‌బీ జనరల్‌ సెక్రటరీ మౌలానా వలీ రెహ్మానీ మాట్లాడుతూ.. యేగీ వ్యాఖ్య‌లు  అవివేక‌మైన‌వ‌ని వాటిపై   ఎలా స్పందించాలో అర్థం కావడం లేద‌న్నారు. తలాక్‌ విషయాన్ని ఆయన (యోగి) ద్రౌపది వస్త్రాపహరణతో ముడిపెడుతున్నార‌ని విమ‌ర్శించారు.  విచక్షణ ఉన్న వారు ఎవరూ ఇలా  మాట్లాడ‌ర‌ని చుర‌క‌లంటించారు. ఈ విషయాలను ఆయన వేరే కోణంలో చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలనీ, సతీసహగమనాన్ని రూపుమాపినట్లుగానే దీన్ని అరికట్టాలని ఆలిండియా షియా పర్సనల్‌ లా బోర్డ్‌ కోరింది.దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయాల‌న్న వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈవ్యాఖ్య‌ల‌పై పార్టీలు  ఎలా స్పందిస్తాయే చూడాలి.

Related

  1. చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ డెడ్ లైన్
  2. రాజ‌కీయాల్లో కేసీఆర్ ఈ రిజ‌ర్వేష‌న్ల స్పూర్తి అమ‌లు చేస్తాడా?
  3. సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన.. ఒక్కొకరి అకౌంట్ కి 4 వేలు..
  4. ఏక్ష‌ణ‌మైనా యుధ్దం.. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త ప‌రిస్తితులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -