ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు–భద్రాచలం ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఓ బస్సు తిరగడంతో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు బృందాలు అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ప్రయివేటు బస్సు ప్రమాదం తీవ్ర విచారానికి గురిచేసింది. ఎన్నో ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారక విషయం. బాధితుల సహాయంపై వివరాలు సేకరించాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అన్జౌ జిల్లాలో హయూలియాంగ్–చాగ్లాగామ్ రోడ్డుపై ఓ మినీట్రక్ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో ఉన్నవాళ్లందరూ అసోంలోని టిన్సుకియా జిల్లాకు చెందినవారు అని పోలీసులు తెలిపారు.
