Tuesday, May 14, 2024
- Advertisement -

ఉల్లి పాయల స్మగ్లింగ్ నిరోధానికి ఆ దేశం కష్టపడుతోంది!

- Advertisement -

ఉల్లిపాయల ధరలు తీవ్రస్థాయికి పెరిగిపోవడంతో వాటి విషయంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కిలోవంద రూపాయల స్థాయికి చేరుకొన్న ఉల్లి పాయలను దొంగతనం చేయడానికి కూడా కొంతమంది వెనుకాడటం లేదు!

బంగారాన్ని దొంగతనం చేసినట్టుగా ఉల్లిపాయలను కూడా  దొంగతనం కూడా లాభసాటి వ్యవహారంగామారింది. ఇప్పటికే అలాంటి వ్యవహారాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఉల్లిపాయల డిమాండ్ స్మగ్లింగ్ ల వరకూ వచ్చింది. ప్రత్యేకించి భారత్ లోకి ఉల్లిపాయలు ఎక్కడ స్మగుల్ అవుతాయో అని బంగ్లాదేశ్ ప్రభుత్వం భయపడుతోంది. బంగ్లాలో ప్రస్తుతానికి అవసరానికి తగిన స్థాయిలో ఉల్లి ఉత్పత్తులు ఉన్నాయట. అయితే ఇండియాలో తీవ్రమైన డిమాండ్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లా నుంచి ఉల్లిపాయలు ఇండియాకు స్మగుల్ అయ్యే అవకాశాలున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. డిమాండ్ ను క్యాష్ చేసుకొనేందుకు స్మగ్లర్లు విజృంభించవచ్చని.. కాబట్టి ఈ పరిస్థితి నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇప్పటికే బోర్డర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. ఉల్లిపాయలు స్మగ్లింగ్ అయ్యే అవకాశాలున్నాయని.. జాగ్రత్తగా ఉండాలని సరిహద్దు భద్రతాదళాలను అలర్ట్ చేసినట్టుగా సమాచారం. మొత్తానికి ఉల్లి ధరలు పెరిగిన అనంతర పరిణామాలు ఇక్కడి వరకూ వచ్చాయనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -