Friday, April 26, 2024
- Advertisement -

అప్పుడు రెచ్చగొట్టి ఆనందించాడు….. ఇప్పుడు రెచ్చిపోతుంటే రగిలిపోతున్నాడు… ముగింపేంటో?

- Advertisement -

రెచ్చగొట్టారు…… ఇంకా ఇంకా రెచ్చగొట్టారు…. ఎన్ని రకాలుగా రెచ్చగొట్టాలో అన్ని రకాలుగానూ రెచ్చగొట్టారు….. ఆ తర్వాత రెచ్చిపోయిన వాళ్ళు కాస్తా ఇతరులను పరుషంగా మాట్లాడుతూ ఉంటే, చెప్పులతో కొట్టే సాహసం కూడా చే్స్తే చూసి ఎంజాయ్ చేశారు. కాలం మారిపోయింది. ఇప్పుడు ఆ రెచ్చిపోయినవాళ్ళు రెచ్చగొట్టిన కెసీఆర్‌కే సినిమా చూపిస్తున్నారు. ద్వేషం ఎప్పుడూ కూడా అంతే….ప్రేమను పంచితే పదిమందీ మనల్ని ప్రేమిస్తారేమో కానీ ద్వేషాన్ని రెచ్చగొడితే ఏదో ఒక రోజు అది మన మెడకే చుట్టుకుంటుంది.

ఉస్మానియా విద్యార్థుల బాధలు కచ్చితంగా వర్ణనాతీతం. అయినా ప్రత్యేకంగా ఉస్మానియా అనే ఏముంది? దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, నిరుద్యోగులు కూడా నరకం చూస్తున్నారు. నాయకులు మాత్రం ఆ విద్యార్థులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. కెసీఆర్ ఆ విద్యను అందరికంటే ఎక్కువగా ప్రదర్శించాడు. పాపాన్ని మొత్తం సీమాంధ్రులపై వేస్తూ ఉస్మానియా విద్యార్థులను ఓ స్థాయిలో రెచ్చగొట్టాడు. రెచ్చిపోయిన ఉస్మానియా విద్యార్థులు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అవమానించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను చెప్పులతో కొట్టారు. భౌతిక దాడులకు దిగారు. ఇక సీమాంద్ర ప్రజలను, ఉస్మానియాలో చదువుకుంటున్న సీమాంధ్ర విద్యార్థులను, అక్కడ పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను తీవ్రంగా అవమానించారు. అప్పుడంతా కూడా కెసీఆర్ మహదానందపడిపోయాడు.

కట్ చేస్తే కెసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. కల్వకుంట్ల వారి కుటుంబం మొత్తం అధికారాన్ని అనుభవిస్తోంది. కానీ ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగుల వెతలు మాత్రం ఒక్కశాతం కూడా తగ్గలేదు. అందుకే ఇప్పుడు వాళ్ళు తమ ఆవేశాన్ని కెసీఆర్‌పై చూపిస్తున్నారు. తెలంగాణా అంతటా ఘన విజయాలు సాధిస్తూ ….ప్రత్యర్థులను జీరోలను చేస్తున్న కెసీఆర్ ఉస్మానియా విద్యార్థుల చేతిలో ఘోరంగా ఓడిపోతున్నాడు. కనీసం ఉస్మానియాలో అడుగుపెట్టలేని స్థితి. అలాగే ఉస్మానియా విద్యార్థులు కెసీఆర్‌ని మామూలుగా తిట్టడం లేదు. 2014కి ముందు సీమాంద్రులను, టీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీల నాయకులను ఎలా తిట్టారో, ఎలా అవమానించారో ఇప్పుడు కెసీఆర్‌కి అదే సినిమా చూపిస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే కెసీఆర్ ఎప్పటికైనా కనీసం ఉస్మానియాలో అడుగుపెట్టగలడా? పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కనీసం ఆ పోరాడిన విద్యార్థులకు అయినా న్యాయం జరుగుతుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకటైతే నిజం. దేశవ్యాప్తంగా కూడా సామాన్యుల పోరాటాలను మెట్లుగా చేసుకుని నాయకులు బాగుపడిపోతున్నారు……. సామాన్యులు మాత్రం సమిథలుగా మిగిలిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -