Sunday, May 19, 2024
- Advertisement -

రాజ‌కీయాల‌లో మ‌రో కామెడి పొలిటీషియ‌న్‌…

- Advertisement -
Pavan kalyan the opposite lokesh and becomes physics zalel khan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కామెడీకి కొదువే లేదు.సినిమాల‌ల్లోనే కామెడీ అనుకుంటె అది రాజ‌కీయ‌లల్లోకి పాకింది.ఇప్ప‌టికే బీకామ్ లో ఫిజిక్స్ జలీల్ ఖాన్ మొదలుపెట్టగా… తర్వాత లోకేష్ బాబు దానికి సీక్వెల్స్ త‌ర్వాత‌ టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి కామెడీ ఎపిసోడ్లు చేస్తూనే ఉన్నారు.

నేనేమి త‌క్కువ‌న్న‌ట్లు మ‌రో రాజ‌కీయ‌పార్టీ అధినేత ..టాప్‌హోరో వారి స‌ర‌స‌న చేరాడు. అప్పుడెప్పుడో.. ‘ఏదేశ మేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ తల్లి నిండు గౌరవమును..’ అనే అద్భుత గేయాన్ని గురజాడ అప్పారావు రాశాడంటూ… చెప్పుకొచ్చాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.తెలుగులోని ఒక గొప్ప గేయాన్ని గుర్తు చేసి.. దాని రచయిత పేరును తప్పుగా చెప్పి …… గురజాడ వంటి మరో గొప్ప కవి ప్రస్తావన తెచ్చి.. అటు ఆ గొప్ప గేయం గురించీ తనకు అవగాహన లేని అజ్ఙానినే.. అని నిరూపించుకున్నాడు జనసేన అధినేత. రెండో తరగతి తెలుగు వాచకంలో… ఉంటుంది, ‘ఏ దేశ మేగినా..’ గేయం. దాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. అయితే చే గువేరా గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ కు మాత్రం ఆ గేయం గురజాడ రాశారని వీరావేశంగా చెప్పుకొచ్చారు.అది ఎవ‌రు రాశార‌ని అడిగితే చిన్న‌పిల్లాడుకూడా చెప్తాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇది ఇలా ఉంటె జనసేనాధిపతి మరోటి వదిలాడు. ఇటీవల తన పార్టీ మీటింగ్ లో జనసేనాధిపతి బల్బును కనుక్కొన్నది ఐన్ స్టీన్ అని చెప్పుకురావడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకైతే ఆరో తరగతి సైన్స్ టెక్ట్స్ బుక్ లో ఉంటుంది.. బల్బును కనుక్కొన్నది థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్ప‌గా ….ఆయన చుట్టూ ఉన్న మేధావులు అంతా చప్పట్లు చరిచారు. పవన్ పిట్టకథ అంతా కరెక్ట్ గా చెప్పాడు కానీ, ఎడిసన్ పేరు బదులు.. ఐన్ స్టీన్ పేరు చెప్పాడు.బల్బ్ ను కనుక్కొన్న ఎడిసన్ విషయంలో.. ఐన్ స్టీన్ పేరు చెప్పడం మాత్రం కామెడీగా ఉంది.రోజు రోజుకీ రాజ‌కీయాల‌ల్లో కామెడీ పొలిటీషియ‌న్స్ ఎక్కువ అవుతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}K3Q7kj2LL9o{/youtube}

Related

  1. 2019 ఎన్నాకల్లో అనంత‌పురం నుండి పోటీ చేస్తా ప‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  2. నటనకు గుడ్ బై చెప్పనున్న పవర్ స్టార్.. ఎందుకో తెలుసా..?
  3. మైదానంలో ఆడే క్రికెట్ జ‌ట్టులో 12 మంది స‌భ్యులుంటారన్న లోకేష్‌…
  4. లోకేష్‌కు చుక్కలు చూపించిన మహిళలు.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -