- Advertisement -
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొంత కాలంగా కంటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ సమస్య పెరగిపోవడంతో పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు పది రోజుల క్రితమే పవన్ కల్యాణ్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించారు.
వారు పవన్ కంటిని పరీక్షించి, ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. శస్త్రచికిత్సతోనే కురుపును తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కంటికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు సర్జరీ సక్సెస్ అయ్యిందని వెల్లడించారు. గురువారం సాయంత్రం పవన్‌ని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
