- Advertisement -

ఒక‌రోజు నిర‌హారా దీక్ష‌ను ప్రారంభించిన ప‌వ‌న్…

- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 9 నుంచి ప్రారంభం అయిన ఈ నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య కొనసాగించనున్నారు.

ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే ఈ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మరోవైపు పవన్‌ దీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన కార్యకర్తలు దీక్షలు చేపట్టనున్నారు. పూర్తి శాంతియుతంగా జరిగే ఈ దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఉద్దానం ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -