చిరంజీవి చేతుల మీదుగా ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్!

- Advertisement -

కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ ఇంతకు ముందు క్షణం, ఘాజీ సినిమాలతో ఆకట్టుకున్నారు. అహిషోర్ సాల్మోన్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సులు కూడా కనిపిస్తున్నాయి. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(NIA) ఏజెంట్‌ విజయ్‌ వర్మగా నాగార్జున అదరగొట్టాడు. కొందరు సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులతో విజయ్ వర్మ చేసే పోరాటమే వైల్డ్ డాగ్ సినిమా.. ఈ మూవీలో నాగ్ ని ముద్దుగా వైల్డ్ డాగ్ అంటారు.

మొదట ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయాలని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. కానీ థియేటర్స్ ఓపెన్ కావడంతో మనసు మార్చుకున్నారు నిర్మాతలు. మన దేశంలో వందల మందిని చంపి మీరేమీ చేయలేరు అంటే.. నేను అందుకు అంగీకరించను అంటూ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ చిత్రం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సోదరుడు నాగ్ ఎప్పటిలాగానే కూల్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు’ అంటూ కితాబునిచ్చారు. ఏ జానర్ లో ప్రయత్నించేందుకైనా నాగ్ వెనుకాడడని ప్రశంసించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -