Friday, April 26, 2024
- Advertisement -

నిరుద్యోగ భృతితో పాటు 50వేల ఉద్యోగాలు భర్తీ..!

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఏమి అడిగినా కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఏం చేశారని బిజెపి అభ్యర్థులకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశ్నించారు. వరంగల్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ హామీలు నెరవేర్చకపోగా… నిత్యావసరాల ధరలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ.. ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 150 ఎకరాలకు పైగా భూమి సేకరించి ఇచ్చినా… కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని దుయ్యబట్టారు.

ప్రజలకిచ్చిన హామీల్లో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతితో పాటు 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నీవెవరు అడిగేందుకు.. నీకేం పని ఏపీతో అంటున్నారని… ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా? మేం మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా అని నిలదీశారు. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్ముతున్నారు… రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడుతారని మండిపడ్డారు.

పిల్లలు పుట్టకుండా సింహానికి ఆపరేషన్!

హైదరాబాద్ లో జలకన్య ఆకారంలో వింత శిశువు జననం!

చెర్రీ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -