- Advertisement -

ఒబామాతో భేటీ అయిన భారత ప్రధాని మోదీ

- Advertisement -

భారతతో అణు మైత్రికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం అణు సరఫరా దేశాలతో (ఎస్ఎన్జీ) స్నేహానికి అమెరికా తన అంగీకారాన్ని తెలియజేసింది. దీంతో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ లో భారత్ చేరడానికి మార్గం సుగమం అయ్యింది. అమెరికాలో మూడు రోజు పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు.

శ్వేతసౌదంలో కలుసుకున్న  వీరిద్దరి మధ‌్య ఇరు దేశాలకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత ప్రధానిగా అయిన తర్వాత నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లడం ఇది నాలుగో సారి. అలాగే ఒబామాతో భేటీ కావడం ఏడో సారి అయితే శ్వేతసౌదంలో వారిద్దరు కలుసుకోవడం నాలుగో సారి. మంగళవారం నాడు వీరిద్దరు వర్కింగ్ లంచ్ సమయంలో కలుసుకుని భోజనం చేస్తూనే ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు ఉగ్రవాదం, క్లీన్ ఎనర్జీ, భూతాపం, ప్రాంతీయ భద్రత, పైబర్ సెక్యూరిటీ వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. భారత్ లో ప్రధాని మోదీ నాయకత్వం అద్భుతంగా ఉందంటూ వైట్ హౌస్ ప్రసంశించింది. వీరిద్దరి కలయిక సందర్భంగా భారత్ కు 667 కోట్ల రూపాయలు విలువైన కళాఖండాలను అమెరికా అప్పగించింది. దీంతో రెండు వేల ఏళ్ల నాటి 220 అతి విలువైన విగ్రహాలు భారత్ కు లభించాయి.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -