Friday, May 3, 2024
- Advertisement -

ర‌త్నాల వెనుక కూడా రాజ‌కీయ‌మేనా!

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏ ప‌ని చేసినా దాని వెనుక ఓ అర్థం, ప‌ర‌మార్థం ఉంటుంది. కొన్ని స్వార్థ ప్రయోజనాలు.. మరికొన్ని రాజకీయ ప్రయోజనాలు లేనిదే మోదీ ఏ ప‌నిచేయ‌ర‌ని జాతీయ రాజ‌కీయాల్లో టాక్‌. ఏ ప‌ని చేసినా సైలెంట్‌గా గ్రౌండ్ వ‌ర్క్ చేసి.. స‌డెన్‌గా అంద‌రికి షాక్ ఇవ్వ‌డం మోదీ స్టైల్‌. జ‌న‌వ‌రి 25న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన భార‌త‌ర‌త్న అవార్డులు కూడా ఈ కోవ‌లోకే వ‌స్తాయి. కాంగ్రెస్ నేత‌, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు మోదీ. ఇటు కాంగ్రెస్ నేత‌లు కూడా ఈ అంశంపై ఏం మాట్లాడ‌లేని ప‌రిస్థితి. ఇలాంటి విష‌యాల్లో సంఘ్ స‌ల‌హా లేనిదే మోదీ ముందుకు వెళ్ల‌ర‌ని బీజేపీ నేత‌ల మాట‌. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆరెస్సెస్ దివంగత ప్రముఖుడు నానాజి దేశ్ ముఖ్, ప్రముఖ కళాకారుడు భూపేన్ హజారికాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు. ప్రణబ్ మినహా.. ఇద్దరికీ.. మరణానంతరం పురస్కారం ప్రకటించారు.

ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ స్వ‌రాష్ట్రం ప‌శ్చిమ‌బెంగాల్‌. ఆయనకు భారతరత్న ఇవ్వడం వెనుక ఉన్న ప్రధానమైన కోణం బెంగాల్ రాజకీయమే అని టాక్ వినిపిస్తోంది. బెంగాల్ లో రాజకీయంగా బలపడటానికి భారతీయ జనతా పార్టీ తాము చేయాల్సిందంతా చేస్తోంది. కానీ.. మమతా బెనర్జీ మాత్రం.. బీజేపీని అడుగు పెట్టనీయడం లేదు. దీంతో నరేంద్రమోడీ… బెంగాల్ ప్రజలను… మరో విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసేందుకే ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారని.. ఇప్పుడు.. బెంగాలీకి .. అత్యంత గౌరవం ఇచ్చానని చెబుతూ.. నరేంద్రమోడీ, అమిత్ షా.. బెంగాల్ ప్రజల్లోకి సెంటిమెంట్ రగిలించడానికి సిద్ధమవుతార‌ని వార్త‌. ప్రబణ్ నే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని బెంగాల్ లో ఎన్నికలకు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు 2019లో తేడా కొడితే ప్రధానిగా గడ్కరీ – ప్రణబ్ ముఖర్జీలను ఆర్ ఎస్ ఎస్ తెరపైకి తెస్తుందన్న వాదనలున్నాయి. అందుకే ఇలా సెట్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక బాబా రాందేవ్ బాబాది మ‌రో బాధ‌. అంతమందికి భారత రత్న ఇస్తున్నారని.. ఒక్క సన్యాసికి ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. దయానంద సరస్వతి – స్వామి వివేకనంద – శివకుమార స్వామి సహా బీజేపీ ఏ సన్యాసికి భారతరత్న ఇవ్వలేదని.. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏదేమైనా అవ‌స‌రం లేనిదే రాజ‌కీయ నేత‌లు ఏ ప‌ని చేయ‌ర‌ని మ‌రోసారి రుజువైందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకు భార‌త‌ర‌త్న కూడా ఏం మిన‌హాయింపు కాదంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -