- Advertisement -

ఎపి సిఎంపై ధర్మాన నిప్పులు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిల్లర పనులు చేస్తూ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని వైఎస్ఆర్ సిపి నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన కాకినాడలో జరిగిన ధర్మాలో ధర్మాన పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడు చేస్తున్న చిల్లర పనులతో కేంద్రంలో ఎపి పరువు పోతోందని, చేయాల్సింది వదిలేసి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పొరాడాలంటూ ప్రకటనలు చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పోరాడటం లేదు కనుకే రాష్ట్ర ప్రజల తరుపున వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి  ఆ బాధ్యత తీసుకున్నారని చెప్పారు.

చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఎపికి  ప్రత్యేక హోదా సాధించేవరకు జగన్మోహర్ రెడ్డి  పోరాడుతూనే ఉంటారని ధర్మాన తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -