Sunday, May 12, 2024
- Advertisement -

హైద‌రాబాద్ అంటే స‌ర్దార్ ప‌టేల్ గుర్తుకొస్తారు… ప్ర‌ధాని మోదీ

- Advertisement -

మెట్రోరైల్‌ను, జీఈఎస్ స‌ద‌స్సును ప్రారంభించేంద‌కు ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక విమానాంలో బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. మోదీకి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్‌, సీఎం కేసీఆర్ స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డే భాజాపా నేత‌ల‌తో కొంత సేపు స‌మావేశ మ‌య్యారు.

అక్క‌డే భాజాపా ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడుతూ.. సోద‌ర సోద‌రీమ‌ణుల్లారా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అంటూ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. దాదాపు ఒక్క నిమిషం పాటు ఆయ‌న తెలుగులో మాట్లాడారు. తెలంగాణ విమోచ‌నంలో అమ‌రులైన వీరుల‌కు జోహార్లు తెలిపారు.

హైద‌రాబాద్ ఒక‌ అద్భుత‌మైన న‌గ‌రం అని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త్‌లో క‌లిపిన స‌ర్దాల్ పటేల్‌కు వీర‌భూమి నుంచి ప్ర‌ణామాలని అన్నారు. హైద‌రాబాద్ అంటే స‌ర్దార్ ప‌టేల్ గుర్తుకొస్తార‌ని తెలిపారు. దేశ వ్యాప్తంగా క‌మ‌లం వికాసం కోసం కృషి చేస్తోన్న బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తుంద‌ని న‌రేంద్ర మోదీ అన్నారు. త‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌తి బీజేపీ కార్య‌క‌ర్త‌కు త‌న ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపి చివ‌ర‌కు తెలుగులోనే ప్ర‌సంగాన్ని ముగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -