Friday, March 29, 2024
- Advertisement -

బాబు ప్రభుత్వ నిర్ణయంతో పేదల బెంబేలు..!

- Advertisement -

ఒకవైపు ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథక ఫలం పొందాలి అన్నా.. తెల్ల కార్డు ఉండాల్సిందే! 

రేషన్ బియ్యం పొందాలన్నా… ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్లు చేయించుకోవాలన్నా… ప్రభుత్వం సాయంతో ఇళ్లు కట్టుకోవాలన్నా.. పించన్లు పొందాలన్నా.. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద సాయం పొందాలన్నా.. రేషన్ కార్డు ఉండాల్సిందే!

ఇలాంటి సవాక్షల పథకాలకు రేషన్ కార్డు ను కలిగి ఉండటం అనేది ప్రాథమిక అర్హతగా చేశారు. వైఎస్సార్ హయాం నుంచే ఈ నియమాన్ని పెట్టారు. అయితే 2004-05లలో రేషన్ కార్డులను తెగ జారీ చేశారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తెల్లకార్డు దారులపై ఒక కన్ను వేసింది!

ప్రభుత్వ పథకాలను పొందే అర్హతకు వీసా లాంటి తెల్లకార్డు విషయంలో బాబు ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తీసుకురానుంది. సగానికి సగం రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇందు కోసం ప్రత్యేక నియమావళిని సిద్ధం చేసింది బాబు ప్రభుత్వం. ఈ నియమాల ప్రకారం చూస్తే… 100 సీసీ పై స్థాయి బైక్ ఉన్న వారు, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా వారు ఉన్నా..స్వయం ఉపాధి ఉన్నవారు.. రెండు సిలిండర్ల గ్యాస్ ఉన్నవారు.. ఇలాంటి వాళ్లందరూ తెల్ల కార్డును కోల్పోతారు. ఆ కార్డును కోల్పోతే చాలా రకాల సంక్షేమ పథకాలకు వారు దూరం అవుతారు! 

ఈ విధంగా వైట్ కార్డు హోల్డర్ల సంఖ్యను తక్కువ చేసి తమ భారాన్ని తగ్గించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఎత్తు వేసినట్టుగా ఉంది! తెలివైన ఆలోచనే. అయితే బాధితులు మాత్రం సామాన్యులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -