Sunday, May 12, 2024
- Advertisement -

అద్భుతం…మంచు దుప్ప‌టిగా మారిన స‌హారా ఎడారి…..

- Advertisement -

అమెరికాను ముంచెత్తిన మంచుతుఫాను స‌హారా ఎడారిని వ‌దిలి పెట్ట‌లేదు. ప్రపంచంలోనే అతిపెద్దది, అత్యంత వేడి కలిగిన ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిని ఈమంచుదుప్పటి కప్పేసింది. ఇది చూపరులను మంత్రమగ్ధులను చేస్తోంది. ఇప్పటికే ఉత్తర అమెరికా, కెనడా దేశాలు మంచు తుఫానులో కూరుకునిపోయిన విషయం తెల్సిందే. ఈ మంచు తుఫాను ధాటికి పదుల సంఖ్య మరణాలు కూడా సంభవించాయి. ఇపుడు ఈ హిమఖడ్గం సహారా ఎడారిని కూడా వదిలిపెట్టలేదు.

ఎర్రటి ఇసుకతిన్నెలన్నీ మంచుతో కప్పబడి, ధ్రువ ప్రాంతాలను తలపిస్తున్నాయి. గత 37 సంవత్సరాల్లో ఇలా జరగడం ఇది నాలుగోసారి. సహారాకు గేట్ వేగా పిలువబడే ఆల్జీరియాలోని ఐన్ సెఫ్రా పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిలో మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. వాతావరణంలో నెలకొన్న అసమానతల వల్లే మంచు కురిసిందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -