- Advertisement -
దర్శకులు రాంగోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. ఆర్జీవీతో పాటు యాంకర్ స్వప్న లపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు పోలీసులు.
హిందూ దేవుళ్లను, ఇండియన్ ఆర్మీ ని, ఆంధ్రులను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దూషించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీనివాస్.
రాంగోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్న పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు శ్రీనివాస్. దీంతో క్రైమ్ నెం : 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act, కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
