Tuesday, May 14, 2024
- Advertisement -

వేములవాడ రాజన్నఆదాయమే ఎక్కువ

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట తర్వాత ఆలయంగా ప్రసిద్ధి పొందిన వేములవాడు రాజన్న ఆలయం ఆదాయంలో మాత్రం యాదాద్రిని వెనక్కి నెట్టేసింది. ఈ ఏడాది వేములవాడ ఆదాయం యాదాద్రి ఆదాయం కంటే పది కోట్లు ఎక్కువగా వచ్చింది.

ఈ సంవత్సరం రాజన్నకు భక్తులు సమర్పించిన కానుకలు 84.92 కోట్లు వచ్చాయి. ఇక యాదాద్రి ఆదాయం 75 కోట్ల రూపాయలకే పరిమితం అయ్యింది. అంతకు ముందు సంవత్సరం యాదాద్రికి 73 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే వేములవాడ రాజన్న ఆలయానికి 70 కోట్ల రూపాయలే వచ్చింది.  ఈ సంవత్సరం సమ్మక్క, సారాలమ్మల జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వేములవాడకు తరలివచ్చారు. దీంతో ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం వేములవాడ ఆదాయాన్ని వంద కోట్ల రూపాయలకు చేర్చడమే లక్ష్యంగా చేసుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -