Thursday, May 16, 2024
- Advertisement -

మరో సంచలనం.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -
Sensation East Godavari Districtcongree Ex Mla Joining Ycp

2019 ఎన్నికలు మరో రెండేళ్లు ఉండటంతో.. ఇప్పుడు ఏపీ రాజకీయా పార్టీలలో చేరికలు మొదలు అయ్యాయి. గత మూడేళ్లుగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందని ఇతర పక్షాల  మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరుతున్నారు.

గత ఎన్నికల్లో వైసీసీ తూగో జిల్లాలో పూర్తిగా చతికిలపడింది. ఉభయగోదావరి జిల్లాలో కీలకమైన కాపుల ఓట్లన్నీ పవన్ కల్యాణ్ ఎఫెక్ట్‌తో టీడీపీకి పడడంతో ఆ పార్టీ ఇక్కడ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. జగ్గంపేటలో గెలిచినా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చంద్రబాబు ఆపరేషన్  ఆకర్ష్‌తో పార్టీకి నమ్మకద్రోహం చేసి టీడీపీలో చేరాడు..దీంతో తూగో జిల్లాలో కాస్త వెనుకంజ వేసిన పార్టీకి పునరుత్తేజం కలిగించేందుకు అధ్యక్షుడు జగన్ సన్నాహాలు ఆరంభించాడు. ఇప్పటికే పార్టీలోకి హర్షకుమార్, ఉండవల్లి లాంటి సీనియర్ కాంగ్రెస్ ఎంపీలను చేర్చుకోవడానికి కసర్తత్తు చేస్తున్నాడు..

తాజాగా తూర్పుగోదావరి జిల్లా  పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి ఈ రోజు వైసీపీలో చేరారు. హైదరబాద్ లోటస్‍పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో రాజేశ్వరీదేవి తన అనుచరవర్గంతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి.,. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరీదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. రాజేశ్వరీ దేవికి పి.గన్నవరం టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం…ఇక  రాజేశ్వరీ బాటలో త్వరలో మరో ముగ్గురు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. దాంతో కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చేసిన మోసం.. వల్ల చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో.. ఎస్పీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి దూరమైన తరుణంలో బలమైన నాయకులు చేరుతుండడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తూగో జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జ‌గ‌న్‌పై లోకేష్ పోటీచేస్తారు బుద్ధా వెంక‌న్న స‌వాల్‌
  2. నేరం రుజువైతే 5 సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌
  3. లోకేష్‌తో టీడీపీ సంక‌నాక‌డం ఖాయం…..అయేమ‌యంలో చంద్ర‌బాబు
  4. అబద్దపు కథనాలు ప్రసారం పై ABNకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవికిరణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -