Friday, May 17, 2024
- Advertisement -

కృష్ణ జిల్లాలో సంచలనం.. వైసీపీలోకి ముగ్గురు కీలక నాయకులు

- Advertisement -
Sensation Krishna Districtthree Famous Leaders May Join Ycp Very Soon

ముంద‌స్తు ఎన్న‌క‌ల స‌మాచారంతో ఏపీలో రాజ‌కీయ పార్టీల‌న్నీ పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించాయి. పార్టీ ఎక్క‌డెక్క‌డ బ‌ల‌హీనంగా ఉందో ఆప్రాంతంలో పార్టీ ప‌టిష్టంపై దృష్టి సారించాయి.ప్ర‌ధానంగా వైసీపీ .. టీడీపీ మ‌ధ్యే పోటీ ప్ర‌ధానం కావ‌డంతో వైసీపీ పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టి పెట్టింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌ల‌ని అన్ని జిల్లాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేష‌న ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో పార్టీ బ‌లోపేతానికి స‌రికొత్త వ్యూహాలు రిచిస్తున్నారు. చంద్ర‌బాబు ఆప‌రేష‌ణ్ ఆక‌ర్శ్ పేరుతో ఇద్దురు ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేరారు. దీంతో 16 స్థానాల్లో ఐదింటిలో గెలిచిన వైసీపీ నుంచి ఇద్దురు టీడీపీలోకి వ‌ల‌స వెల్లారు.

ఆస్థానాల‌ను భ‌ర్తీ చేసెందుకు కొంత‌మంది కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు న‌గ‌ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చారు. తాజాగా మ‌రికొంత మంది నాయుల‌పై దృష్టిసారించారు. మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, మ‌ల్లాది విష్ణు, పారిశ్రీమిక వేత్త సినీ నిర్మాత పివిపి వ‌ర‌ప్ర‌సాద్ లాంటి వారిని పార్టీలోకి చేర్చుకొనేందుకు పావులు క‌దుపుతున్నారు. గ‌తంలో పివిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ సీటును ఆశించాడు. కానీ ప్ర‌స్తుత ఎంపీ కేశినేని నాని టికెట్టు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఈసారి వైసీపీ నుంచి పోటీచేయ‌ల‌ని ఆశించ‌డంతో జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాట్లు స‌మాచ‌రాం.

గ‌తంలో ల‌గ‌డ‌పాటి చంద్ర‌బాబును క‌ల‌సిన‌పుడు టీడీపీలో చేరుతారని వ‌చ్చిన వార్త‌ల‌ను ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఖండించారు. దాంతోపాటు టీడీపీలో ఉన్న వ‌ర్గ పోరుకార‌నంగా పార్టీలో చేర‌డానికి వెన‌క‌డుగు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పివిపికి విజ‌యవాడ ఎంపీ టికెట్ ను కేటాయిస్తే… ల‌గ‌డ‌పాటి మైల‌వ‌రంనుంచి పోటీ చేసె అవ‌కాశాలు ఉన్న‌ట్లు రాజ‌ధానిలో చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ ముగ్గురిలో మ‌ల్లాది వ‌ష్ణు,పివీపిలు త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇక ల‌గ‌డ‌పాటి విష‌యంలో త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వైసీపీ నాయ‌కులు చెప్ప‌తున్నారు. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు ప్రారంభ‌మ‌యిన‌ట్లు స‌మాచారం. దీంతో టీడీపీ అయేయంలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లు అంటుండంతో ఆలోగా పార్టీనీ అన్ని జిల్లాల్లో ప‌టిష్ట చేయాల‌ని జ‌గ‌న్ చేస్తున్న వ్యూహాలు ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయే చూద్దాం.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జ‌గ‌న్ వేసిన ప్లాన్ అదిరింది
  2. చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..
  3. భూమా చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్
  4. జగన్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -