- Advertisement -
శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందెపల్లి మండలం నడింపల్లిలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన పసికందును తల్లి చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఉదయం సమయంలో శిశువు ఏడుపులు విని అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని శిశువును రక్షించారు.
గ్రామస్తులు వెంటనే పసికందును హిందుపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు ప్రాథమిక చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆ పసికందు ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తుల అప్రమత్తతతో ఒక చిన్నారి ప్రాణం నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు.
