- Advertisement -

లీక్ అయిన జబర్దస్త్’ పారితోషికాలు

- Advertisement -

జబర్దస్త్’ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ ఎంతో పాప్యులర్ అయ్యారు. ఈ కామెడీ షోలో చేస్తోన్న ఆర్టిస్టులకు పారితోషికాలు కూడా భారీగానె ఉంటాయనె టాక్ ఉంది. జబర్దస్త్ తో లక్షలు సంపాదించిన వాళ్లు ఉన్నారు. ఈ కామెడీ షో’లో కంటెస్టెంట్ల దగ్గర నుంచి జడ్జీల వరకు ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.దీని గురించి చాలా సార్లు,అంతా,ఇంతా అనే టాక్ వచ్చింది కాని పక్కాగా ఇంతా అని ఎవరు చెప్పలేక పోయారు.ఇప్పుడు తాజాగా ఆ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు,రోజాతో పాటు కమెడియన్ల రెమ్యునరేషన్‌ వివరాలు లీక్ అయ్యాయి.

ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న నాగబాబుకి నెలకి 20 లక్షలు .. రోజాకి 15 లక్షలు పారితోషికంగా ముడుతున్నాయట. ఇక యాంకర్స్ గా అనసూయ నెలకి 4 లక్షలు తీసుకుంటుంటే, రష్మీ నెలకి 3 లక్షలు అందుకుంటుందని అంటున్నారు.బుల్లితెరలో స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్న టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక్ చంద్ర , సుడిగాలి సుధీన్ అందరికంటే ఎక్కువగా నెలకు 4 లక్షలు తీసుకుంటడగా హైపర్ ఆదీ మాత్రం నెలకు 3 లక్షలే తీసుకుంటున్నారంట.

ఇతర నటుల విషయానికి స్తే రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు,హైపర్ ఆది రూ.3 లక్షలు అందుకుంటుండగా..గెటప్ శ్రీను,రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు చెరో 2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారట.ఇకపోతే బులెట్ భాస్కర్‌కు 2 లక్షలు వరకు రెమ్యునరేషన్ వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒక స్కిట్ కు ఇంత మొత్తం అనే రేంజ్ లో గతంలో వీళ్ల పారితోషికాలు ఉండేవి. అయితే అవన్నీ తీసేసి ఇప్పుడు నెలజీతం ఫిక్స్ చేశారు. మొత్తంగా చూసుకుంటే జబర్దస్త్ టీమ్ లో అతి తక్కువ జీతం 75వేల రూపాయలుగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -