- Advertisement -

SLBC టన్నెల్ పనులు పున:ప్రారంభం

- Advertisement -

తెలంగాణలో కీలకమైన నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులు టన్నెల్ నిర్మాణాన్ని పునఃప్రారంభించారు.

గత ఏడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో జరిగిన ప్రమాదం కారణంగా పనులు దీర్ఘకాలంగా నిలిచిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత భద్రతా చర్యలు, సాంకేతిక అంశాలపై సమీక్షలు చేపట్టడంతో పనులు ఆలస్యమయ్యాయి.

అయితే 2026 ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్‌లెట్ వైపు నుంచి పనులను తిరిగి ప్రారంభించారు. టన్నెల్ తవ్వకాల్లో డీబీఎం (Drilling and Blasting Method) పద్ధతిని ఉపయోగిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు.

పనులు సజావుగా కొనసాగేందుకు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. గత ప్రమాదం పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ టన్నెల్ పూర్తయితే నీటిపారుదల వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా మారి, రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -