Saturday, May 4, 2024
- Advertisement -

నిద్రలేమి సమస్యా…అయితే జగ్రత్త!

- Advertisement -

జీవన శైలీలో వస్తున్న మార్పులు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఏ చిన్న వ్యాధి అయినా అది క్రమక్రమంగా పెద్దదై పెనుభూతంగా మారుతోంది. ప్రధానంగా మానసిక ఒత్తిడి, అధికంగా ఆలోచించడం,తినే ఆహారంలో మార్పులు వెరసీ నిద్రలేమి సమస్యకు దారితీస్తున్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలను వేధిస్తోంది నిద్రలేమినే. సరిగా నిద్రలేక పోవడం వల్ల జబ్బుల బారిన పడుతున్నారు. ఫలితంగా ఏ చిన్న పనికైనా చికాకు పడటం,ఎవరితో మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక కొంతమందికి నిద్రలో మెలకువ వస్తుంది, ఇలా రాత్రిపూట ఒకే సమయానికి మెలకువ వస్తుందంటే శరీరంలో ఏదో తేడా ఉన్నట్లేనని చెబుతున్నారు డాక్టర్లు.

మనిషి ఉల్లాసంగా ఉండాలన్న,శరీరంలో ప్రతి అవయం సరిగా పనిచేయాలన్న ప్రతి మనిషికి 9 గంటల నిద్ర అవసరం. అయితే వయసును బట్టి ఒక గంట అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ కనీస నిద్ర పోకపోవడం వల్లే ఈ సమస్యలన్నింటికి కారణం. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం) శరీరంలోని ఫ్యాట్స్‌‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్లి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే.. గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం.

ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌‌గా ఉంటుంది. శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌‌‌‌లో ఏదో ప్రాబ్లమ్‌‌ ఉందని అర్ధం. అందుకే ప్రతీ రోజు 6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -